అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, కలెక్టర్ సమీక్ష: వేగవంతం చేయాలని ఆదేశం

నగర అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని గౌరవ ఎమ్మెల్లే ఎం ఎస్ రాజ్ ఠాకూర్ గారు మరియు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.

అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, కలెక్టర్ సమీక్ష: వేగవంతం చేయాలని ఆదేశం
అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, కలెక్టర్ సమీక్ష: వేగవంతం చేయాలని ఆదేశం
అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, కలెక్టర్ సమీక్ష: వేగవంతం చేయాలని ఆదేశం
అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, కలెక్టర్ సమీక్ష: వేగవంతం చేయాలని ఆదేశం
అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, కలెక్టర్ సమీక్ష: వేగవంతం చేయాలని ఆదేశం

బుధవారం  అక్టోబర్ 15 :-


 రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ ఎం ఎస్ రాజ్ ఠాగూర్ గారు జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష ,, అదనపు కలెక్టర్ జే. అరుణ శ్రీ తో కలిసి రామగుండం నగరంలో విస్తృతంగా పర్యటించారు

గోదావరిఖని లోని సమ్మక్క సారలమ్మ జాతర గద్దెల అభివృద్ధి పనులు,  గోదావరి నది ఒడ్డున ఉన్న స్మశాన వాటిక నిర్మాణ పనులు, రామగుండం మసీదు టర్నింగ్, రామగుండం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రైల్వే స్టేషన్ ఎదురుగా జరుగుతున్న షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. 

ఈ సందర్భంగా రామగుండం శాసనసభ్యులు గౌరవ శ్రీ ఎం ఎస్ రాజ్ ఠాగూర్ గారు మరియు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,   సమ్మక్క సారలమ్మ గద్దల అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. సింగరేణి, ఆర్ ఎఫ్ సి ఎల్, ఎన్టిపిసి, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. 

గోదావరి నది ఒడ్డున ఉన్న స్మశాన వాటిక అభివృద్ధి పనులను పరిశీలించి కలెక్టర్ పలు సూచనలు చేశారు. నగరంలోని అంబేద్కర్ విగ్రహం ముందు జంక్షన్ అభివృద్ధి, ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ ప్రతిపాదనలు సమర్పించాలని అన్నారు. మసీదు టర్నింగ్ పాయింట్, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి కావాలని కలెక్టర్ ఆదేశించారు.రామగుండం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. 

అంతకుముందు రామగుండం మున్సిపల్ కార్యాలయంలో నగర అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ పై సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు.  2025-26 ఆర్థిక సంవత్సరంలో 28 కోట్ల 8 లక్షల రూపాయల డీ.ఎం.ఎఫ్.టీ‌ నిధుల ద్వారా నగరంలో 181 అభివృద్ధి పనులు మంజూరు చేయడం జరిగిందని, వీటికి సంబంధించి టెండర్ల ప్రక్రియ త్వరగా చేపట్టి పనులు గ్రౌండ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.  

రామగుండం నియోజకవర్గ పరిధిలో  ఎన్టిపిసి సంస్థ సిఎస్ఆర్ నిధుల  ద్వారా 8 కోట్ల 55 లక్షల రూపాయలతో 31 అభివృద్ధి పనులు మంజూరు చేసామని, వీటిలో చాలావరకు నగర కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయని, అభివృద్ధి పనులకు నిధులు ఆటంకం లేనందున ఎక్కడ ఆలస్యం కాకుండా త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చేలా అధికార యంత్రాంగం పనిచేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. 

ఈ పర్యటనలో రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ గారి మరియు  జిల్లా కలెక్టర్ వెంట మున్సిపల్ అధికారులు, సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
---------------------------------------------