గోదావరిఖని ఐ.బి. కాలనీ శ్రీ విఘ్నేశ్వర–భక్తాంజనేయ స్వామి ఆలయ పునరుద్ధరణ: మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్ సందర్శన

మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్ గోదావరిఖని ఐ.బి. కాలనీలోని పునరుద్ధరించిన శ్రీ విఘ్నేశ్వర ఆలయాన్ని సందర్శించారు. దాతలైన అంబటి దంపతులకు వారు ధన్యవాదాలు తెలిపారు.

గోదావరిఖని ఐ.బి. కాలనీ శ్రీ విఘ్నేశ్వర–భక్తాంజనేయ స్వామి ఆలయ పునరుద్ధరణ: మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్ సందర్శన
గోదావరిఖని ఐ.బి. కాలనీ శ్రీ విఘ్నేశ్వర–భక్తాంజనేయ స్వామి ఆలయ పునరుద్ధరణ: మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్ సందర్శన
గోదావరిఖని ఐ.బి. కాలనీ శ్రీ విఘ్నేశ్వర–భక్తాంజనేయ స్వామి ఆలయ పునరుద్ధరణ: మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్ సందర్శన
గోదావరిఖని ఐ.బి. కాలనీ శ్రీ విఘ్నేశ్వర–భక్తాంజనేయ స్వామి ఆలయ పునరుద్ధరణ: మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్ సందర్శన

గోదావరిఖని, అక్టోబర్ 19 (ఆదివారం):

గోదావరిఖనిలోని ఐ.బి. కాలనీలో సుమారు 26 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ విఘ్నేశ్వర–భక్తాంజనేయ స్వామి ఆలయం పునరుద్ధరణ పనులు విజయవంతంగా పూర్తి చేసుకుని నూతన శోభతో విరాజిల్లుతోంది. పునరుద్ధరణ అనంతరం, ఈ శక్తివంతమైన దేవాలయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు గౌ. దుద్ధిల్ల శ్రీధర్ బాబు గారు మరియు ఎస్‌.సి., గిరిజన సంక్షేమ మరియు మైనారిటీల శాఖ మంత్రివర్యులు గౌ. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు సోమవారం ఉదయం సందర్శించారు.

మంత్రులు ఇద్దరూ ఆలయానికి విచ్చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించి, శ్రీ విఘ్నేశ్వర–భక్తాంజనేయ స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు.

భక్తుల సౌకర్యార్థం నూతన నిర్మాణం

ఈ సందర్భంగా మంత్రులు శ్రీధర్ బాబు గారు మరియు లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడుతూ— భక్తుల సౌకర్యార్థం ఆలయాన్ని నూతన రూపంలో పునర్నిర్మించడం పట్ల తమ అనందాన్ని వ్యక్తం చేశారు. భగవంతుడి ఆశీస్సులు ప్రజలకు, ప్రాంతానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు.

అలాగే, ఆలయ పునరుద్ధరణకు చేయూతనందించిన దాతలు అర్చన – సంతోష్ రావు అంబటి దంపతులను మంత్రులు ప్రత్యేకంగా అభినందించారు, వారి సేవలను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఈజీసీ స్టేట్ డైరెక్టర్ ధండు రమేష్, మాజీ కార్పొరేటర్ పిచర శ్రీనివాస్ రావు, కె. నరేశ్, ముసుకుల పాపిరెడ్డి, దేవేందర్ రెడ్డి, స్వాతి రమేష్, కె. సంపత్ రెడ్డి, జి. ప్రభాకర్ రావు, ఆలయ అర్చకులు భాస్కర్ శర్మ తదితర ప్రముఖులు మరియు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.