తెలంగాణ బీసీ జేఏసీ బంద్‌కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు: రేపు గోదావరిఖనిలో భారీగా పాల్గొనండి - ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ ఆదేశం
తెలంగాణ బీసీ జేఏసీ బంద్‌కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు: రామగుండం నియోజకవర్గంలో బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపు
కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు నమస్కారాలు.
ఈనెల 18వ తేదీన తెలంగాణ బీసీ జేఏసీ బంద్‌కు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నది.
బీసీ రిజర్వేషన్ల బలోపేతం విషయంలో అందరం ఏకముగా ముందుకు సాగవలసిన ఆవశ్యకత ఉంది. రాహుల్ గాంధీ గారి ఆశయ సాధన కోసం మరియు సమాజ న్యాయం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఎనలేని కృషికి మద్దతుగా, ఈ బంద్‌కు ప్రజలందరూ చురుకుగా పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ కోరుతోంది.
బీసీ బంద్ ద్వారా బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) పిలుపునిచ్చిన నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా బంద్‌ను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరుచున్నది.
ఈ క్రమంలో, రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆదేశాల మేరకు, గోదావరిఖని ప్రాంతంలో బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు రేపు (అక్టోబర్ 18) ఉదయం 8 గంటలకు స్థానిక ప్రధాన చౌరస్తాకు ద్విచక్రవాహనాలతో రావాల్సిందిగా అన్ని నాయకులు మరియు కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాము.
ఈ ముఖ్యమైన కార్యక్రమంలో — కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, విభాగాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనార్టీ సెల్, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, మహిళా కాంగ్రెస్, సోషల్ మీడియా కోఆర్డినేటర్స్ మరియు పార్టీ కార్యకర్తలు — అందరూ చురుకుగా పాల్గొని బీసీల హక్కుల పరిరక్షణ ఉద్యమానికి మద్దతునివ్వాలని కోరడమైనది.
Shiva Rama Krishna