గోదావరిఖనిలో అర్ధరాత్రి కారు దగ్ధం: కుటుంబం సురక్షితం
గోదావరిఖని (పెద్దపల్లి జిల్లా), అక్టోబర్ 17 అర్ధరాత్రి సమయంలో పెను ప్రమాదం తప్పింది. మంచిర్యాల వైపు వెళ్తున్న ఒక హ్యుందాయ్ వెన్యూ కారు ఎఫ్‌సీఐ క్రాస్ రోడ్డు దాటి, బి-టైప్ గేట్ మార్గంలో డివైడర్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారులో మంటలు చెలరేగి, వాహనం పూర్తిగా దగ్ధమైంది. అయితే, కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు సమయస్ఫూర్తితో వ్యవహరించి, మంటలు వ్యాపించేలోపే సురక్షితంగా బయటపడ్డారు. వారికి ఎలాంటి గాయాలూ కాలేదు.స్థానికుల సమాచారంతో వెంటనే చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
Shiva Rama Krishna